ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నా వంతు బాధ్యతగానే ఈ పని చేశాను'

ఎవ‌రో వ‌స్తార‌ని... ఏదో చేస్తార‌ని ఆ యువ‌కుడు ఎదురు చూడ‌లేదు. ప్ర‌తీ రోజు తాను ప‌డుతున్న క‌ష్టం మ‌రెవ్వ‌రూ ప‌డ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నాడు.. ప్రమాదాలు తగ్గించడానికి అతను ప్ర‌య‌త్నిస్తున్నాడు. ప‌ది మందికి ఉప‌యోగ‌ప‌డాల‌నే ల‌క్ష్యంతో విశాఖ మ‌న్యం గూడెం కొత్త‌వీధి మండ‌లంలో ఓ గిరిజ‌న యువ‌కుడు ర‌హ‌దారిలో ఇరువైపుల ఉన్న తుప్ప‌లను తొలగిస్తున్నాడు.

driver cut the bushes at  beside  of  rampula ghat road
రంపుల ఘాట్ ర‌హ‌దారిలో డ్రైవ‌ర్

By

Published : Aug 21, 2020, 1:08 PM IST

విశాఖ మ‌న్యం గూడెం కొత్త‌వీధి మండ‌లం రంపుల ఘాట్ ర‌హ‌దారిలో ఇరువైపులా తుప్ప‌లు పెద్ద ఎత్తున ఉన్నాయి. వీటి వల్ల ర‌హ‌దారిలో ప్ర‌యాణించే వాహ‌న చోద‌కుల‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎదురెదురుగా వ‌స్తున్న వాహ‌నాలు క‌నిపించ‌క..అక్కడ త‌రుచూ ప్ర‌మాదాలు జరుగుతున్నాయి. ఈ విష‌యంపై ప‌లుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ..స్పందిచే వారే కరువయ్యారు. వారి బాధలను చూసిన గూడెంకొత్త‌వీధి జీసీసీ గ్యాస్ గోదాములో డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్న చాప‌రాతిపాలెంకి చెందిన వంత‌ల జాన్‌బాబు ర‌హ‌దారి బాగు కోసం న‌డుంబిగించాడు.

చేసేది తాత్కాలిక ఉద్యోగ‌మైనా ఉద్యోగానికి సెల‌వుపెట్టి ...రోజుకు 20 మంది కూలీల‌ను పెట్టి త‌న సొంత ఖర్చుతో వాటిని తొలగిస్తున్నాడు. రంపుల నుంచి కాట్ర‌గెడ్డ వ‌ర‌కూ ఉన్న 16 కిలోమీట‌ర్ల ఘాట్ ర‌హ‌దారిలో పనులు చేస్తున్నారు. కూలీలకు భోజనాలు ఏర్పాటుచేస్తున్నాడు. వీటివల్ల ఎందరో ప్రమాదాలకు గురైన అధికారులు స్పందించడం లేదని..అతను తెలిపాడు. అందుకే తనవంతు బాధ్యతగా వాటిని తొలగిస్తున్నానని జాన్​బాబు పేర్కొన్నాడు.

ఇదీ చూడండి.'మీకు ప్యాలెస్​లు కావాలి కానీ...పేదోడు మాత్రం రేకులు షెడ్డుతో సరిపెట్టుకోవాలా?'

ABOUT THE AUTHOR

...view details