నీటి చుక్క కోసం జనాల ఎదురు చూపులు - drinking water problem news in cheedikada
వేసవి కాలం రాకుండానే వివిధ రూపాల్లో నీటి ఎద్దడి మొదలైంది. విశాఖ జిల్లా చీడికాడ మండలం అర్జునగిరిలో కుళాయిలకు నీటి సరఫరా చేసే వాల్ మరమ్మతులకు గురి కావడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా గత నాలుగు రోజుల నుంచి ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
విశాఖ జిల్లా చీడికాడ మండలం అర్జునగిరిలో గత నాలుగు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. గ్రామంలో ఉన్న రక్షిత మంచినీటి పథకం నుంచి కుళాయిలకు నీటి సరఫరా చేస్తున్న వాల్ మరమ్మతులకు గురైంది. ఫలితంగా నీటి సరఫరా నిలిచిపోయింది. గత నాలుగు రోజులుగా ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేసేది లేక గ్రామానికి దూర ప్రాంతంలో ఉన్న బోర్ల వద్దకు ప్రజలు పరుగులు తీస్తున్నారు. బోరు నీళ్లు రంగు మారటంతో అవి తాగడానికి పని చేయడం లేదు. అధికారులు నీటి సమస్యను పట్టించుకోవడం లేదంటూ గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు తమ సమస్యను గుర్తించి తాగునీరు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.