ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంచినీటి కోసం.. చేయి చేయి కలిపారు.. - విశాఖ జిల్లా అరకు లోయ దేవరపల్లిలో తాగునీటి సమస్య తాజా వార్తలు

ఎవరో వచ్చి.. ఏదో చేస్తారని.. ఎదురు చూడకుండా.. తమ గ్రామంలోని సమస్యల పరిష్కారానికి నడుం బిగించారు. తాగునీటి సమస్యను పారద్రోలేందుకు చేయి చేయి కలిపారు విశాఖ జిల్లా అరకు లోయ మండలం దేవరపల్లి గ్రామ వాసులు. ఒక్కో కుటుంబం నుంచి 12 వేల రూపాయలు చొప్పున విరాళాలు సేకరించారు. ఐదు లక్షల వరకు పోగు చేసి పైప్ లైన్​, ట్యాంకులను ఏర్పాటు చేసుకున్నారు.

drinking water problem at araku vally
తాగునీటి కోసం దేవరపల్లి గ్రామ వాసుల శ్రమదానం

By

Published : Feb 20, 2020, 5:10 PM IST

తాగునీటి కోసం దేవరపల్లి గ్రామ వాసుల శ్రమదానం

'అధికారులు వస్తున్నారు పోతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి. అయినప్పటికీ.. ఆ గ్రామంలో గంగమ్మ మాత్రం నిలవడం లేదు. అధికారులు చేపట్టిన తాగునీటి పథకాలు మూడునాళ్ల ముచ్చటే అయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరుగుతున్న పట్టించుకున్న నాథుడు లేడు. ఈ పరిస్ధితితో విసుగెత్తిన గ్రామస్థులు చేయి చేయి కలిపి సంఘటితమయ్యారు. ఊరు సమస్యను పరిష్కరించుకోనేందుకు.. అనుకున్నదే తడవుగా ఒక్కో కుటుంబం నుంచి 12 వేల రూపాయల చొప్పున విరాళాలు సేకరించారు. ఐదు లక్షల వరకు పోగు చేసి, పైపులు, ట్యాంకులను కొనుగోలు చేశారు.

చిన్నా పెద్దా తేడా లేకుండా పైప్ లైన్ పనులు చేసేందుకు పలుగు, పార పట్టి.. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తాగు నీటిని గ్రామానికి తీసుకొచ్చారు. కూలి పనులు చేసి సంపాదించిన డబ్బులను, అమ్మఒడి కింద వచ్చిన మొత్తాలను ఇలా తాగునీటి ఏర్పాటు కోసం వెచ్చించారు. రక్షిత తాగునీరు లేకపోవడంతో నిత్యం రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు కోట్లు ఖర్చు చేసి, క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసిన పథకాలు ఎంత మేర పనిచేస్తున్నాయో పరిశీలించటం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. రక్షిత తాగునీటిని అందిస్తారని.. తాము వెచ్చించిన డబ్బులను తిరిగి ఇచ్చేలా.. అధికారులు చర్యలు తీసుకోమాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇవీ చూడండి...

'చట్టాలను కాలరాసే హక్కు ఎవరికీ లేదు'

ABOUT THE AUTHOR

...view details