విశాఖలో మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. ధరలు పెరిగినా మద్యం కొనేందుకు మద్యం ప్రియులు వెనుకాడటం లేదు. ఉదయం నుంచి వివిధ ప్రాంతాలలో మద్యం దుకాణాల వద్ద గొడుగులతో మందుబాబులు వరుస క్రమంలో కూర్చున్నారు.
మద్యం దుకాణాల ముందు గొడగులతో మందుబాబులు..! - liquor stores latest news in Visakhapatnam
మద్యం ధరలు పెరిగినప్పటికీ విశాఖలో మందుబాబులు లైన్లు కట్టారు. భౌతిక దూరం పాటిస్తూ... గొడుగుతో మద్యం దుకాణాల ముందు బారులు తీరుతున్నారు.
![మద్యం దుకాణాల ముందు గొడగులతో మందుబాబులు..! మద్యం దుకాణాల ముందు గొడగులతో మందుబాబులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7081797-583-7081797-1588753118152.jpg)
మద్యం దుకాణాల ముందు గొడగులతో మందుబాబులు
భౌతిక దూరం పాటించాలి, గొడుగులు తప్పని సరిగా వినియోగించాలని విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా ఆదేశించారు. ఈమేరకు వినియోగదారులు ముఖానికి మాస్క్, గొడుగు తీసుకుని వరుసలో నిలబడి మద్యం దుకాణాలు వద్ద పడిగాపులు కాస్తున్నారు.