ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'డాక్టర్​ సుధాకర్​కు మరో ఆసుపత్రిలో చికిత్స ఇప్పించండి'

సుధాకర్​కు చికిత్స చేసే ఆసుపత్రి మార్పు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు కోరారు. విశాఖలో మాట్లాడిన సుధాకర్​ కుటుంబ సభ్యులు ఆయనకు అందుతున్న వైద్యంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తమ బిడ్డ విషయంలో పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని సుధాకర్​ తల్లి కావేరి బాయి స్పష్టం చేశారు.

Dr. Sudhakar's family members press meet
డాక్టర్​ సుధాకర్​ కుటుంబ సభ్యులు

By

Published : May 28, 2020, 8:23 AM IST

వైద్యుడు సుధాకర్​కు సరైన వైద్య సదుపాయం అందడం లేదని ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సుధాకర్ ప్రభుత్వ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్​కు రాసిన లేఖపై వారు స్పందించారు. మరో ఆసుపత్రిలో చికిత్స అందించాలని కోరారు.

ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిపై మానసిక రోగి అని ముద్ర వేసి ఉద్దేశపూర్వకంగా దుష్ప్రభావం చూపించే మందులు ఇస్తున్నారని ఆరోపించారు. ఆసుపత్రిలో సుధాకర్​కు చికిత్స అందిస్తున్న వైద్యుడిని వివరాలు అడిగినప్పటికీ తమకు ఏ విధమైన సమాధానం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details