శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం గురువం గ్రామంలో పదో తేదీన, లావేరు మండలం అదపాక గ్రామంలో పద మూడో తేదీన దళిత కుటుంబాలపై దాడులు జరిగాయి. దాడులు జరిగి వారం రోజులు గడుస్తున్నా.. ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేయకపోవడం దారుణమని విశాఖపట్నం జిల్లా దళిత సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు.
'దళితవాడలపై దాడులకు పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలి' - srikakulam district latest news
శ్రీకాకుళం జిల్లాలోని గురువం, అదపాక గ్రామాల్లోని దళితవాడలపై దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని విశాఖపట్నం జిల్లా దళిత సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. ఐక్యవేదిక ఆధ్వర్యంలో దాడులను వ్యతిరేకిస్తూ నిరసన నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లాలో ఆందోళన