బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావానికి విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతంలోని జలాశయాలు పూర్తిస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే అదనపు నీటిని గేట్లు ఎత్తి వేసి దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నాతవరం మండలంలోని తాండవ జలాశయం గరిష్టస్థాయికి చేరుకుంది. 1800 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తుండగా...స్పిల్ వే గేట్ల ద్వారా దిగువ ప్రాంతాలకు 800 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.
నిండుకుండల్లా జలాశయాలు...దిగువకు నీరు విడుదల - narsipatnam news
భారీ వర్షాలు, ఎగువ పరివాహాక ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి కారణంగా...విశాఖ జిల్లా నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లోని జలాశయాలు నిండుకున్నాయి. అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
అల్పపీడన ప్రభావంతో.... రానున్న రోజుల్లో వరద ప్రభావం పెరిగే అవకాశం ఉండటంతో..దిగువ ప్రాంతాలకు మరింత నీరు వదిలేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రావికమతం మండలం కళ్యాణపులోవ జలాశయానికి సంబంధించి పూర్తిస్థాయి నీటిమట్టం 460 అడుగులు కాగా... ఈ నెల 12వ తేదీ సాయంత్రానికి 458.5 అడుగులకు చేరింది. ప్రస్తుతం 4 గేట్లను ఎత్తి 200 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా జలాశయాల వద్ద జల వనరుల అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ఇదీ చదవండి:నరసాపురం-కాకినాడ మధ్య తీరాన్ని దాటిన తీవ్రవాయుగుండం