ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిస్సహాయ బాలికకు సాయం.. ప్రధాని మాటలే స్ఫూర్తి - విశాఖ కేజీహెచ్​లో ఒడిశా బాలిక

ఉపాధి కోసం ఒడిశా నుంచి విశాఖకు వచ్చిన ఆ బాలికకు బలమైన గాయమైంది. వైద్యం కోసం కేజీహెచ్​కు వెళ్లింది. అక్కడ స్కానర్ పనిచేయడంలేదని.. బయట ల్యాబ్​లో స్కాన్ చేయించుకుని రిపోర్టులు తీసుకువస్తే వైద్యం చేస్తామని చెప్పారు. తల్లిదండ్రులు దగ్గరలేరు. చేతిలో చిల్లిగవ్వ లేదు. చేసేదేమీలేక ఆసుపత్రి బయటే చెట్టుకింద కూర్చుంది. అది చూసిన దాతలు స్పందించి సొంత డబ్బుతో ల్యాబులో పరీక్షలు చేయించారు. దగ్గరుండి కేజీహెచ్ తీసుకొచ్చి వైద్యం అందేలా చేశారు.

donors-helps-to-odissa-girl-in-vizag
నిస్సహాయ బాలికకు సహాయం

By

Published : Apr 29, 2020, 5:39 PM IST

Updated : Apr 29, 2020, 10:56 PM IST

ఒడిశాకు చెందిన గాయత్రి సోదరుడితో కలిసి విశాఖలో ఉంటోంది. అనుకోకుండా జరిగిన ప్రమాదంతో ఆమె తలకు బలమైన గాయమైంది. వైద్యం కోసం సోదరుడు, స్నేహితురాలితో కలిసి కేజీహెచ్​కు వెళ్లింది. అక్కడు స్కాన్ చేసే పరికరాలు పనిచేయడంలేదని.. బయట ల్యాబులో పరీక్ష చేయించుకుని రిపోర్టులు తీసుకువస్తే వైద్యం చేస్తామని వైద్యులు చెప్పారు. అయితే డబ్బుల్లేని పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోక ఆసుపత్రి బయట చెట్టుకింద కూర్చున్నారు.

ఆ సమయంలో అన్నార్తులకు ఆహారం అందజేస్తున్న దాతలు బాలికను చూశారు. ఆమె వద్దకు వచ్చి విషయం తెలుసుకుని సహాయం చేశారు. లలిత్ గాడ్ అనే దాత ఆమెను ల్యాబ్​కు తీసుకెళ్లి సొంత ఖర్చుతో పరీక్షలు చేయించారు. రిపోర్టులు తీసుకుని స్వయంగా కేజీహెచ్​లో చేర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లాక్ డౌన్ కారణంగా వైద్య సేవల విషయంలో చిన్న,మధ్య తరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని.. దాతలు ముందుకొచ్చి అలాంటి వారిని ఆదుకోవాలని ప్రధాని చెప్పిన మాటల స్ఫూర్తితో బాలికకు సహాయం చేశానని చెప్పారు.

నిస్సహాయ బాలికకు సాయం.. ప్రధాని మాటలే స్ఫూర్తి

ఇవీ చదవండి.. వంద కిలోమీటర్లు వెళ్లి రక్తదానం చేసిన యువకుడు

Last Updated : Apr 29, 2020, 10:56 PM IST

ABOUT THE AUTHOR

...view details