విశాఖలో కరోనా వ్యాప్తి నివారణకు నిరంతరం శ్రమిస్తోన్న పోలీసులు, వైద్య సిబ్బందికి సహాయం అందించేందుకు సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్, కంకటాల మల్లిక్ ముందుకు వచ్చారు. మూడో పట్టణ చెక్‌పోస్టు వద్ద పోలీసు సిబ్బందికి భోజనంతో పాటు సీపీ ఆర్కే మీనా చేతుల మీదుగా గ్లౌజులు, మాస్క్‌లు అందజేశారు. పోలీసు, శానిటేషన్, వైద్య సిబ్బంది, అనాథలు, అభాగ్యులకు ప్రతి రోజూ ఆహారం అందిస్తామని దాతలు తెలిపారు.
విశాఖలో సీపీ చేతుల మీదుగా పోలీసులకు మాస్కులు పంపిణీ - విశాఖలో పోలీసుల తాాజా వార్తలు
కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా లాక్‌డౌన్‌ను అమలు చేసేందుకు నిరంతరం శ్రమిస్తోన్న వివిధ శాఖల సిబ్బందికి సహకరించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. విశాఖలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, వైద్య సిబ్బందికి సీఎంఆర్ అధినేత భోజనం, మాస్కులు అందించారు.
![విశాఖలో సీపీ చేతుల మీదుగా పోలీసులకు మాస్కులు పంపిణీ Donor contribution to police staff at visakhapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6581955-674-6581955-1585464460300.jpg)
Donor contribution to police staff at visakhapatnam