ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎడతెరిపిలేని వర్షాలు.. డొంకరాయి జలాశయానికి పోటెత్తుతున్న వరద - డొంకరాయి జలాశయానికి పోటెత్తుతున్న వరద

విశాఖజిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. డొంకరాయి జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. జలాశయం నుంచి 34,500 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. జలాశయాల వద్ద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

donkarayi  water flow in vishaka
donkarayi water flow in vishaka

By

Published : Aug 13, 2020, 1:58 PM IST

విశాఖ - తూర్పుగోదావరి జిల్లా సరిహద్దుల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వ ర్షాలకు జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాలైన వలస గెడ్డ , పాల గెడ్డ , ఇంతులూరివాగుల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో డొంకరాయి జలాశయం నీటిమట్టం ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. ఐదు గేట్లు ఎత్తి 34,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తుండడంతో తూర్పు గోదావరి జిల్లా ముంపు మండలాలకు ముప్పు పొంచి ఉండటంతో అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సీలేరు, జోలాపుట్ , బలిమెల జలాశయాలకు కూడా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అధికారులు జలాశయాలు వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details