రెండు నెలలు పాటు కొనసాగిన సీలేరు కాంప్లెక్స్ లోని డొంకరాయి పవర్ కెనాల్ గండి పూడ్చివేత పనులు పూర్తయ్యాయి. ఆగస్టు12న డొంకరాయి పవర్ కెనాల్ కు భారీ గండి పడింది. పునర్నిర్మాణం కోసం సివిల్ అధికారులు చాలా ఇబ్బందులు పడ్డారు. సూమారు కోటిరూపాయలు అంచనా వ్యయంతో 65 రోజుల పాటు శ్రమించి అధికార్లు ఈ గండిని పూడ్చివేశారు. పవర్ కెనాల్ పనితీరును పరిశీలించటానికి, విజయవాడ నుంచి విచ్చేసిన ఏపీ జెన్కో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.రత్నబాబు పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. పవర్ కెనాల్ కు జలహరతి సమర్పించారు. అనంతరం 485 మెగావాట్ల డొంకరాయి పోల్లూరు జలవిద్యుత్ కేంద్రాలకు నీటిని విడుదల చేశారు. ఈ విద్యుత్పత్తితో రాష్ట్రంలో విద్యుత్ లోటుని కొంత తీర్చే అవకాశం ఉంటుందని ఈ.డి రత్నబాబు తెలిపారు. త్వరలోనే ప్రాజెక్టు అవసరమైన సివిల్ సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమిస్తామని ఆయన పేర్కొన్నారు.
సీలేరు డొంకరాయి పవర్ కెనాల్ గండి పూడ్చివేత పనులు పూర్తి - డొంకరాయి పవర్ కెనాల్ తాజా వార్తలు
విశాఖలోని సీలేరు డొంకరాయి పవర్ కెనాల్ కు పడిన గండిని పూడ్చివేశారు. సుమారు కోటి రూ. వ్యయంతో సుమారు రెండు నెలలు శ్రమించి గండిని పూడ్చినట్లు విద్యుత్ అధికార్లు తెలిపారు.
డొంకరాయి పవర్ కెనాల్ గండి పునర్నిర్మాణం