ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ ప్రభుత్వ ఛాతి ఆసుపత్రికి జేడీ ఫౌండేషన్ వితరణ - జేడీ ఫౌండేషన్ తాజావార్తలు

జేడీ ఫౌండేషన్​ ప్రతినిధులు.. విశాఖ ప్రభుత్వ ఛాతి ఆసుపత్రికి వైద్యపరికరాలను విరాళంగా అందించారు. కొవిడ్​ బాధితులకు ఉపయోగపడే ఆక్సిజన్​ సిలిండర్లు, మాస్కులను సమకూర్చారు.

oxygen cylinders
ఆక్సిజన్​ సిలిండర్లు

By

Published : May 27, 2021, 11:25 AM IST

విశాఖ ప్రభుత్వ ఛాతి ఆసుపత్రికి.. జేడీ ఫౌండేషన్ వైద్య పరికరాలు విరాళంగా అందించింది. యాభై ఆక్సిజన్​ సిలిండర్లు, రెగ్యులేటర్స్​, ఫ్లో మీటర్లు, హ్యూమిడి​ఫైర్​ బాటిల్స్​, ఆక్సిజన్​ మాస్క్​లు పంపిణీ చేశారు. వీటివల్ల మరింత మంది రోగులకు అత్యవసర చికిత్స అందించే అవకాశం కలిగిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.విజయ కుమార్ చెప్పారు.

రీఫిల్ చేసుకునే సౌకర్యం ఉన్న ఆక్సిజెన్ సిలెండర్లు ఇచ్చారని… వాటి ద్వారా మేలు కలుగుతుందని వైద్యులు పేర్కొన్నారు. వైద్య పరికరాలు అందించినందుకు జేడీ ఫౌండేషన్​కు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో జిల్లాలోని మరిన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైన పరికరాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని ఫౌండేషన్ సభ్యులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details