విశాఖపట్నం జిల్లాలో కొవిడ్-19పై జరుగుతున్న పోరాటంలో భాగంగా పలువురు దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. లుపిన్ హ్యూమన్ వెల్ఫేర్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ &ఫార్మా కంపెనీ జనరల్ మేనేజర్ అభిజిత్ షిండే 2500 పీ.పీ.ఈ కిట్లు, ఎల్&టీ హైడ్రోకార్బన్ ఇంజినీరింగ్ డైరెక్టర్ అమిత్ అగర్వాల్ 300 పీపీఈ కిట్లు, మైలాన్ లేబరేటరీస్ సంస్థ హెడ్ సునీల్ వాద్వా, హెచ్.ఆర్.సరస్వతి రూ.5లక్షల చెక్కు, సియోనిక్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ సుబ్బారావు రూ.5లక్షల చెక్కు, హెచ్.పీ.సీ.ఎల్ విశాఖ రిఫైనరీ ఉద్యోగులు తమవంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.27,98,792.55 రూపాయల చెక్కును స్థానిక జిల్లా కలెక్టర్ వినయ్చంద్కు అందించారు.
కలెక్టర్కు విరాళాల చెక్కు అందజేత - CM relief fund news updates
కరోనా వ్యాప్తి నివారణకు ఏర్పాటైన ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. విశాఖపట్నం జిల్లాలో పలువురు దాతలు విరాళాల చెక్కులను స్థానిక కలెక్టర్కు అందించారు.
కలెక్టర్కు విరాళాల చెక్కు అందజేత