బిడ్డ పోయిన బాధలోనూ కుమారుని అవయవాలు దానం చేసి దాతృత్వం చాటుకున్నారు ఆ తల్లిదండ్రులు. విశాఖలోని అల్లిపురం ప్రాంతంలో నివాసముంటున్న ఎస్.నవీన్ సాయికుమార్ కంచరపాలెం ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలలో ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 3న కళాశాల వద్ద రోడ్డు దాటుతుండగా వ్యాను ఢీ కొట్టింది. ఈ ఘటనలో నవీన్ తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు కేర్ ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు కావడంతో శుక్రవారం వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. జీవన్‌దాన్ సభ్యులు బాధితుడి తల్లిదండ్రులను సంప్రదించారు. వాళ్లు అవయవదానం చేయడానికి అంగీకరించడంతో రామ్‌నగర్ కేర్‌లో శస్త్రచికిత్స నిర్వహించారు. కాలేయం మాత్రమే దానం చేయటానికి అనుకూలంగా ఉండటంతో విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ఏసీపీ ఎయిర్‌పోర్ట్ వరకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు.
దాతృత్వం.. బిడ్డ అవయవాలు దానం చేసిన తల్లిదండ్రులు - Young_Boy_Brain_Dead_Organ_Donation_
విశాఖ జిల్లా కంచరపాలెంలో ఈ నెల 3న రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన నవీన్ బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో తమ బిడ్డ అవయవాలను దానం చేసి దాతృత్వం చాటుకున్నారు తల్లిదండ్రులు.
బిడ్డ అవయవాలు దానం చేసి ... దాతృత్వం చాటుకున్న తల్లిదండ్రులు