ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుక్కల బెడద.. 10 దూడలు బలి - 10 calf died

విశాఖ జిల్లాలో కుక్కల బెడద ఎక్కువైందని స్ధానికులు ఆందోళన చెందుతున్నారు. రెండు మూడు రోజుల్లో 10 ఆవు దూడలను దాడి చేసి చంపేశాయన్నారు.

vishaka district
కుక్కల బెడద.. 10 దూడలు బలి

By

Published : May 28, 2020, 11:33 AM IST

విశాఖ జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరులో కుక్కల బెడద ఎక్కువైంది. పంచాయితీ పాలకులు కుక్కల సంచార విషయంలో సరైన నివారణ చర్యలు చేపట్టని కారణంగా వీటి బెడద ఎక్కువ అవుతోందని స్ధానికులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో ప్రతి వీధిలో రాత్రి పగలు వీటి స్వైరవిహారం అధికమవుతోంది.

రెండు మూడు రోజుల్లోనే 10 ఆవు దూడలను దాడి చేసి చంపేశాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాడి గేదెల పెంపకం పట్ల సంరక్షణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కుక్కల దాడి వ్యవహారంలో తామేమీ చేయలేకపోతున్నామని ఆవేదన చెందారు. అధికారులు సరైన నివారణ చర్యలు చేపట్టి పాడి పశువుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details