విశాఖ జిల్లా సీలేరు మార్కెట్ సెంటర్లో ఆవుదూడకు శునకం పాలిచ్చిన అరుదైన ఘటన కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసి పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు. గత కొన్ని రోజులుగా ఆవుదూడ, శునకం ఎంతో మచ్చికగా ఉంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఆ అనుబంధమే.. ఈ దృశ్యానికి కారణమై ఉంటుందని భావించారు.
మాతృత్వానికి మచ్చుతునక... ఆవుదూడకు పాలిచ్చిన శునకం - ఆవుదూడకు పాలిచ్చిన శునకం వార్తలు
అమ్మను మించిన దైవం లేదని అని ఓ సినీకవి అన్నారు. నిజమే అమ్మతనం అంత గొప్పది. మాతృత్వానికి మనుషులు, జంతువులు అని తేడాలుండవు. అలాంటి ఘటనే విశాఖ జిల్లా సీలేరులో జరిగింది. తన జాతి కాకపోయినా.. ఓ ఆవుదూడ ఆకలి తీర్చి మాతృత్వాన్ని చాటుకుంది. మాతృత్వంలోని మాధుర్యాన్ని పంచింది.

ఆవుదూడకు పాలిచ్చిన శుకనం
Last Updated : Feb 12, 2020, 11:48 AM IST