విశాఖ మన్యం ప్రజలకు సేవలందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన నర్సీపట్నంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో సేవలు కొరవడుతున్నాయి. చిన్నపిల్లలతో ఆసుపత్రికి వచ్చిన ఎంతోమంది బాలింతలు.. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిరీక్షించినా వైద్యులు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:దిల్లీ ఎయిమ్స్‌లో ఓపీ సేవలు బంద్!
ఈ ఆసుపత్రిలో గత ప్రభుత్వ హయాంలో అనేక సదుపాయాలకు ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టారు. అందుకు తగ్గట్టుగా ఇక్కడ సేవలు అందడంలేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణగా ఇటీవలే గొలుగొండ మండలానికి చెందిన ఓ బాలింత మరణించింది. అయినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడం బాధాకరమని స్థానికులు వాపోతున్నారు.
ఇదీ చదవండి:
పథకం సిద్ధంగా ఉంది.. నత్త నడకన పైప్‌లైన్ పనులు