అసలే కరోనా.... జాగ్రత్తలు తప్పనిసరి.... రక్షణ పరికరాలు కావాలని అడిగాడు ఓ డాక్టర్. ఎన్-95 మాస్కులు ఎందుకు ఇవ్వట్లేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అక్కడే మెుదలైంది వివాదం... అప్పుడే మొదలయ్యాయి వేధింపులు. రోడ్డుపై అర్ధనగ్నంగా తిరిగేలా.. అతడి జీవితం తయారైంది. చివరకు మానసికి స్థితే.. బాగలేదంటూ ముద్రపడింది.
- ఎన్-95 మాస్కులడిగితే..
విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో మత్తు వైద్యుడిగా పనిచేస్తున్న సుధాకర్.... కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్యులకు ఎన్-95 మాస్కులు ఇవ్వడం లేదంటూ.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అనుభవం లేని వైద్యులతో ఆపరేషన్లు చేయిస్తున్నారని...., ప్రజాప్రతినిధులు సైతం ఆసుపత్రిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 8న డాక్టర్ సుధాకర్‌ను సస్పెండ్ చేస్తూ... ఆదేశాలు వెలువడ్డాయి. అప్పటి నుంచి డాక్టర్ సుధాకర్‌కు కష్టాలు మెుదలయ్యాయి.
- రోడ్డుపై పడుకోబెట్టి.. ఆటోలో కుదేసి
సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా... మే 16న విశాఖలో పోర్టు ఆసుపత్రి ఎదుట అర్ధనగ్నంగా... డాక్టర్ సుధాకర్ నిరసన వ్యక్తం చేశారు. గొడవ చేస్తున్నట్లు స్థానికులు చెప్పగా... అక్కడికి వెళ్లిన పోలీసులు... ఆయన ఎవరో తెలుసుకోకుండానే చేతులు వెనక్కి విరిచికట్టి రోడ్డుపై పడుకోబెట్టారు. ఆ తర్వాత ఆటోలో కుదేసి పోలీస్ స్టేషన్‌కు..., అక్కడి నుంచి కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. సుధాకర్ మానసిక పరిస్థితి బాగోలేదని కేజీహెచ్ వైద్యులు చెప్పడంతో.... పోలీసులు ఆయనను ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తరలించారు. సుధాకర్‌పై 353, 427 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అరెస్టు చేసే సమయంలో వైద్యుడిపై కానిస్టేబుల్ కొట్టిన వీడియో బయటికొచ్చింది. మద్యం మత్తులో డాక్టర్ హల్‌చల్ చేసినట్టు చెప్పిన విశాఖ సీపీ ఆర్కే మీనా.... వైద్యుడిని కొట్టిన కానిస్టేబుల్‌ను అదే రోజు సస్పెండ్ చేశారు.
- హైకోర్టే మాకు దిక్కు
కుమారుడి పరిస్థితిపై ఆందోళన చెందిన డాక్టర్ సుధాకర్ తల్లి.... విశాఖ కమిషనర్‌ను కలిశారు. తన కుమారుడికి ప్రాణహాని ఉందని తెలిపారు. కోర్టుకు హాజరుపరిచే సమయంలో తన కుమారుడికి ఏమైనా జరగొచ్చంటూ సీపీ దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నారు. కోర్టుకు వెళ్లే సమయంలో తననూ తీసుకెళ్లాలని ఆర్కే మీనాను గతంలో అభ్యర్థించారు. అయితే తాజాగా హైకోర్టు తీర్పుపై సుధాకర్ తల్లి సంతోషం వ్యక్తం చేశారు. పరువు కాపాడుకోవాలంటే హైకోర్టే మాకు దిక్కు అంటూ వ్యాఖ్యానించారు. సీబీఐ విచారణతో న్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
- రాజకీయ పార్టీల స్పందన