ప్రభుత్వ మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న వైద్యుడు సుధాకర్ తల్లి ఇవాళ విశాఖ నగర పోలీస్ కమిషనర్‌ను కలిశారు. హైకోర్టు ఆదేశాల మేరకు రేపు వైద్యుడు సుధాకర్‌ను పోలీసులు హైకోర్టులో హాజరు పరచనున్న నేపథ్యంలో తన కొడుకుతో పాటు తమను కూడా తీసుకువెళ్లాలని ఆమె కోరారు.
'వైద్యుడు సుధాకర్‌కు ప్రాణహాని ఉంది' - 'వైద్యుడు సుధాకర్‌కు ప్రాణహాని ఉంది'
వైద్యుడు సుధాకర్‌కు ప్రాణహాని ఉందని ఆయన తల్లి విశాఖ కమిషనర్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. రేపు హైకోర్టుకు తన కొడుకుతో పాటు తనను కూడా తీసుకెళ్లాలని కోరారు.
తన కుమారునికి ప్రాణ హాని ఉందని.. విశాఖ నుంచి విజయవాడ కోర్టుకు తరలించే సమయంలో ఏమైనా జరగవచ్చనే అనుమానాన్ని ఆమె పోలీసు కమిషనర్ ఆర్కే మీనా ముందు వ్యక్తపరిచారు. ఎటువంటి భయాందోళనకు గురవ్వొద్దని సుధాకర్‌కు ఎటువంటి హాని జరగకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు.
TAGGED:
doctor sudhakar mother news