దీపావళి అనగానే మనకు గుర్తుకు వచ్చేవి పూజలు, పిండివంటలు, దీపాలు, టపాసులు. అయితే విశాఖలోని సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మెనేజ్మెంట్ విద్యార్థులకు మాత్రం దీపావళి అంటే పర్యావరణ పండుగ. ఈ రోజు పర్యావరణానికి హాని చేయకూడదన్నది వారి నినాదం. బాణాసంచా పేల్చటం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థుల్లో అవగాహన పెంచాలనే ఉద్దేశ్యంతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది కళాశాల యాజమాన్యం. పల్లెల్లో పండగ వాతావరణం ప్రతిబింబించే విధంగా పచ్చని తోరణాలు, పువ్వులతో అలంకరించే ముగ్గులు, మిరిమిట్లు గొలిపే విద్యుత్ దీపకాంతులు ఏర్పాటు చేశారు. వీటిలో ఎక్కడా ప్లాస్టిక్ వాడకుండా చూసుకున్నారు. యువతీయువకులు పట్టు వస్త్రాలు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వివిధ రకాల పిండివంటలు తయారుచేసి అతిథులకు పంచారు.
పట్టణంలో పల్లె వాతావరణం... వినూత్నంగా దీపావళి సంబరం - విశాఖలో దీపావళి వేడుకలు
వెలుగుల పండుగ దీపావళిని వినూత్నంగా జరుపుకున్నారు ఆ విద్యార్థులు. పర్యావరణహితమైన వస్తువులతో పండగ వాతావారణాన్ని స్పష్టించి చక్కని పిండి వంటలు చేసి అతిథులకు పంచిపెట్టారు. సంప్రదాయ వస్త్రధారణతో కనువిందు చేశారు. ఆ వేడుక వివరాలు తెలుసుకోవాలంటే విశాఖకు వెళ్లాల్సిందే...!
సదరన్ హోటల్మేనేజ్మెంట్ విద్యార్థినులు