విశాఖ ఏజెన్సీ పరిధిలోని హుకుంపేట మండలం మత్స్య గుండంలో విష ప్రయోగంతో చేపలు మృత్యువాతపడ్డాయి. ఇక్కడి కొండ వాగుల్లో కొలువైన మత్స్యలను స్థానికులు దేవతామూర్తులుగా కొలుస్తారు. చేపలు కొలనులో ఉన్న కొండ బండ రాళ్ల మధ్య ఈదుతూ భక్తులు సమర్పించే మరమరాలు, అటుకులు బెల్లం తింటుంటాయి. స్థానికులు వాటిని దేవతామూర్తులుగా కొలుస్తున్నందున వీటిని ఎవరూ పట్టుకోరు.
మత్స్యగుండంలో విషప్రయోగం.. మృతి చెందిన చేపలు - Divine Fishes Died in Manyam
గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేయడంతో మన్యం ప్రజల ఇలవేల్పు మత్స్య దేవతలు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన విశాఖ ఏజెన్సీలో కలకలం సృష్టించింది. స్పందించిన గ్రామ సర్పంచ్ శాంతి కుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విష ప్రయోగం : మత్సగుండంలో మృత్యువాడ పడ్డ మత్స్యదేవతలు
ఈ నేపథ్యంలో ఎగువ ప్రాంతంలోని వారు మందు వేయడంతో ఆ చేపలు మృత్యువాత పడ్డాయి. ఈ విషయంపై సర్పంచ్ శాంతి కుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవీ చూడండి :రఘురామ కేసులో ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టు ధిక్కరణ నోటీసుల జారీకి ఆదేశం!
TAGGED:
మత్స్య గుండంలో చేపలు మృతి