విశాఖ జిల్లా కశింకోట మండలం చింతలపాలెంలోని కంటైన్మెంట్ జోన్ ను ఎస్పీ అట్టాడ బాబూజీ పరిశీలించారు. అక్కడి బందోబస్తుపై ఆరా తీశారు. సిబ్బంది ఆరోగ్యో పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించారు. జిల్లా అదనపు ఎస్పీ క్రైమ్ అచ్యుతరావు, అనకాపల్లి గ్రామీణ సీఐ పీవీ నరసింహారావు, పట్టణ సీఐ భాస్కర్ రావు పాల్గొన్నారు. కంటైన్మెంట్ జోన్ లో ఉన్న పరిస్థితులు, ఆంక్షలు అమలవుతున్న తీరును ఎస్పీకి వివరించారు.
కంటైన్మెంట్ జోన్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ - anakapalli cantonment zone latest news update
కరోనా విధుల్లో ఉన్న సిబ్బంది ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖ జిల్లా ఎస్పీ అట్టాడ బాబుజీ తెలిపారు. విశాఖ జిల్లా కశింకోట మండలం చింతలపాలెం కంటైన్మెంట్ జోన్లో బందోబస్తును పరిశీలించారు. ఆయన సిబ్బంది ఆరోగ్యపరంగా తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు.
![కంటైన్మెంట్ జోన్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ District SP inspects the cantonment zone](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7092413-465-7092413-1588818493391.jpg)
కంటోన్మెంట్ జోన్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ