డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా 'నేను సైతం' చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. విశాఖ జిల్లా పాడేరు పరిధిలోని కొయ్యూరు మండలం శరభన్నపాలెం గ్రామంలో వీటిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అరకులోయ ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి హాజరయ్యారు. వారు ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి క్రికెట్ పోటీలు ప్రారంభించారు.
క్రీడాకారులను పరిచయం చేసుకుని, బ్యాటింగ్, బౌలింగ్ చేసి ఉత్సాహపరిచారు. క్రీడల వల్ల ప్రతి వ్యక్తిలోనూ నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని వారు అన్నారు. యువత చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. దీనివల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతంలో వైభవంగా జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు 'నేను సైతం' చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివ ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలిపారు.