చీడికాడ మండలం తురువోలులో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. వచ్చే నెలలో జరుగనున్న మోదకొండమ్మ తల్లి తీర్థమహోత్సవం సందర్భంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. స్టార్ లైట్స్ యువత ఆధ్వర్యంలో.. గ్రామ పెద్దల చేతుల మీదుగా టోర్నమెంట్ ప్రారంభించారు.
మొత్తం 63 జట్లు పాల్గొననున్నాయి. తొలిరోజు.. యువకులు, అభిమానుల కేరింతల మధ్య సందడిగా పోటీలు జరిగాయి. విజేతలకు నగదు పురస్కారాన్ని అందజేయున్నట్లు స్టార్ లైట్స్ సంఘం ప్రతినిధులు తెలిపారు.