విశాఖ జిల్లా చీడికాడలో యువత, ఉద్యోగులు... సంయుక్తంగా జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. కార్యక్రమానికి సీఐ సయ్యద్ ఇలియాస్ మహమ్మద్ ముఖ్యఅతిథిగా హాజరై పోటీలు ప్రారంభించారు.
క్రీడాకారులను ఆయన పరిచయం చేసుకున్నారు. క్రికెట్ టోర్నమెంట్‌కు జిల్లా వ్యాప్తంగా 80 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్నాయని నిర్వాహకులు తెలిపారు. చీడికాడ ఎస్సై సంతోష్ పాల్గొన్నారు.