విమ్స్‌లో ఏర్పాటు చేసిన 650 పడకలను సెప్టెంబరు ఒకటి నాటికి వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. విమ్స్‌ను తనిఖీ చేసిన ఆయన... సిబ్బంది పనితీరు పర్యవేక్షణలో భాగంగా సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించారు. ఆస్పత్రిలో కావాల్సిన పరికరాలను సమకూర్చుకోవాలన్నారు. ఇటీవల రిక్రూట్ చేసిన అభ్యర్థులకు వెంటనే నియామకపత్రాలు అందజేయాలని తెలిపారు. సిబ్బందిని మూడు షిప్టులుగా విభజించి, ప్రతి షిప్టుకు ఒకరిని భాద్యుడిగా నియమించాలని స్పష్టం చేశారు.
గత రెండు నెలల కాలంలో కొవిడ్ నుంచి కోలుకున్న వారి ప్లాస్మాలను సేకరించాలని కలెక్టర్ సూచించారు. వారికి ప్లాస్మా దానంపై అవగాహన కల్పించాలని అన్నారు. ఫ్లాస్మా దానం చేసిన వారికి ప్రోత్సాహక బహుమతిగా ప్రభుత్వం అందిస్తున్న అయిదు వేల రూపాయలను మొత్తాన్ని ఏర్పాటు చేయవలసినదిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి తెలిపారు.