ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విమ్స్ ఆసుపత్రిని పరిశీలించిన జిల్లా కలెక్టకర్ - విమ్స్ ఆసుపత్రి వార్తలు

విశాఖ జిల్లాలో విమ్స్ ఆసుపత్రిని జిల్లా కలెక్టరు వినయ్ చంద్  సందర్శించి వైద్య సేవలు, వసతులను పరిశీలించారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ఆసుపత్రిలో సేవలు మరింత విస్తరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

District Collector   inspected Wims Hospital  in visakha
విమ్స్ ఆసుపత్రిని పరిశీలించిన జిల్లా కలెక్టకర్

By

Published : Aug 6, 2020, 7:37 PM IST

విశాఖ జిల్లాలో విమ్స్ ఆసుపత్రిని జిల్లా కలెక్టరు వినయ్ చంద్ సందర్శించి వైద్య సేవలు, వసతులను పరిశీలించారు. ఆసుపత్రిలో గల సౌకర్యాలుపై ఆసుపత్రి డైరెక్టర్, ఇతర అధికారులు, వైద్యులతో ఆయన సమావేశమయ్యారు. రానున్న కాలంలో కోవిడ్ కేసులు పెరిగే అవకాశమున్నందున, ముందు జాగ్రత్తగా అందుకు అవసరమైన వసతులు ఆసుపత్రులలో సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అందజేస్తున్న సేవలు వసతులను మరింత మెరుగు పరచుకోవాలి అన్నారు. అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని, అవసరమైన పరికరాలను, వెంటిలేటర్లను, ఆక్సిజన్ సిద్దం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో విమ్స్ డైరెక్టరు సత్యవరప్రసాద్, ప్రత్యేక ఉప కలెక్టరు సూర్యకళ, జిల్లా ఆరోగ్య శాఖాధికారి డా.తిరుపతిరావు, డా. చలం, డా. వేణుగోపాల్ లు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details