విశాఖ జిల్లా చోడవరం పట్టణంలో తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో కూరగాయలు, కోడిగుడ్లు, ఇతర నిత్యావసరాలు అందజేశారు. తెలుగు దేశం పార్టీ నాయకుడు, గోవాడ చక్కెర కర్మాగారం పాలకవర్గం మాజీ ఛైర్మన్ గూనురు మల్లునాయుడు సారధ్యంలో ఈ సామగ్రి పంపిణీ చేశారు. లాక్డౌన్లో నిరాశ్రయులైన వారికి నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండలాధ్యక్షుడు గూనూరు పెదబాబు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కనిశెట్టి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.
తెదేపా అధ్వర్యంలో కూరగాయల పంపిణీ
విశాఖ జిల్లా చోడవరం పట్టణంలోని పేదలకు తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
తెదేపా అధ్వర్యంలో కూరగాయల పంపిణీ