ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అరకు లోయలో పోడు భూములకు పట్టాలు పంపిణీ - అరకులో పోడు భూములకు పట్టాలు పంపిణీ వార్తలు

విశాఖ జిల్లా అరకు లోయలో పోడు భూములకు పట్టాలు పంపిణీ చేశారు. రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ ఆశాభావం వ్యక్తం చేశారు.

rails distribution to farmers
అరకు లోయలో పోడు భూములకు పట్టాలు పంపిణీ

By

Published : Nov 22, 2020, 10:13 AM IST

పోడు భూములకు ప్రభుత్వం అందిస్తున్న హక్కు పత్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ కోరారు. విశాఖ జిల్లా అరకు లోయలో హక్కు పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మొదటి విడతగా 1421 ఎకరాలకు 976 మంది రైతులకు హక్కు పత్రాలు ఇచ్చారు.

ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న పత్రాలు ఇవ్వడంవల్ల రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. పట్టాల పంపిణీ కోసం శ్రమించిన రెవెన్యూ సిబ్బందిని ఆయన అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details