విశాఖ జిల్లా రాజవరం డెక్కన్ ఎరువుల పరిశ్రమ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరకులు, కరోనా నివారణ కిట్లను పంపిణీ చేశారు. వీటిని స్థానిక ఎమ్మెల్యే బాబూరావు చేతుల మీదుగా పేదలకు అందించారు. ఈ సేవా కార్యక్రమానికి సుమారు రూ.25 లక్షలు వెచ్చించినట్లు పరిశ్రమ ప్రతినిధి లక్ష్మీపతిరాజు తెలిపారు. అయిదు గ్రామాలకు చెందిన 2,500 మందికి ఈ కిట్లు పంపిణీ చేస్తామన్నారు.
డెక్కన్ పరిశ్రమ ఆధ్వర్యంలో సరకులు, కరోనా నివారణ కిట్లు పంపిణీ - lockdown
లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థింగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు పలువురు తమ వంతు సహాయం అందిస్తున్నారు. తమకు తోచినంత తోడ్పాటునందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
డెక్కన్ పరిశ్రమ ఆధ్వర్యంలో సరకులు, కరోనా నివారణ కిట్లు పంపిణీ