ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాత్రికేయులకు నిత్యావసర సరకులు, కరోనా కిట్లు పంపిణీ - పాత్రికేయులకు కరోనా కిట్ల వార్తలు

విశాఖలోని ఐటీఐ జంక్షన్​ వద్ద పాత్రికేయులకు నిత్యావసర సరకులు, కరోనా కిట్లు పంపిణీ చేశారు. నగర పశ్చిమ నియోజక వర్గ సమన్వయకర్త విజయప్రసాద్​ జన్మదినం సందర్భంగా వైకాపా కార్పొరేటర్​ ముర్రు వాణి నానాజీ, పార్టీ నేత కొలుసు కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

covid kits for journalists
నిత్యవసర సరుకులు, కరోనా కిట్ల పంపిణీ

By

Published : May 23, 2021, 2:56 PM IST

వైకాపా కార్పొరేటర్​ ముర్రు వాణి నానాజీ, పార్టీ నేత కొలుసు కుమార్ ఆధ్వర్యంలో విశాఖలోని ఐటీఐ జంక్షన్​ వద్ద పాత్రికేయులకు నిత్యావసర సరకులు, కరోనా కిట్లు పంపిణీ చేశారు. నగర పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త విజయప్రసాద్​ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. కొవిడ్​ సమయంలో జర్నలిస్టుల సేవలు మరువలేనివని ముర్రు వాణి అన్నారు. కొవిడ్​ బాధితులకు, పేద ప్రజలకు తమ వంతు సాయం అందిస్తున్న కుమార్​ను అభినందించారు.

పాత్రికేయులపై తమకు ఎంతో గౌరవం ఉందని కొలుసు కుమార్ అన్నారు. ప్రజలు, ప్రభుత్వానికి వారధిలా ఉంటూ… ప్రాణాలకు తెగించి కరోనాపై అవగాహన కల్పిస్తున్న జర్నలిస్టులకు తన వంతు సాయం అందించడం సంతృప్తిగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కరోనా వేళ.. ప్రజాభిప్రాయ సేకరణలేల?

ABOUT THE AUTHOR

...view details