ఛత్తీస్గఢ్ నుంచి విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం తెనుగుపూడికి వచ్చిన వలస కూలీలు లాక్డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో ఇక్కడే ఉండిపోయారు. ఉపాధి లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇబ్బందులు గమనించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు.. వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
వలస కూలీలకు నిత్యావసర వస్తువుల పంపిణీ - దేవరాపల్లి వార్తలు
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్తో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలు తమ స్వగ్రామాలకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కరవై ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. తమవంతు సహాయం అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
వలస కూలీలకు నిత్యావసర వస్తువుల పంపిణీ