శ్రీకాకుళం జిల్లాలో...
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కరోనాపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. రామచంద్రాపురం, పొన్నంపేట గ్రామాల్లో ఎన్ఎస్ఎస్పీఓ రవిబాబు.... విద్యార్థులతో సేవా కార్యక్రమాల్లో భాగంగా కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో తాగునీటి బోర్ల వద్ద మురికి, చెత్త తొలగించి బ్లీచింగ్ చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని అన్నారు.
లావేరు మండలం పాతరౌతుపేట గ్రామంలో ఎమ్మెల్యే కిరణ్ కుమార్ నిత్యావసరాలు అందజేశారు. సుమారుగా 750 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్డౌన్ పాటించాలని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి కుటుంబానికి స్థానిక వైకాపా నాయకులు కొమ్ము సాయి, రఘుమండల కృష్ణారావు, కొమ్ము గాంధీ తమ సొంత నిధులతో నిత్యావసరాలను పంపిణీ చేశారు.
విశాఖ జిల్లాలో...
అనకాపల్లి మండలం సీహెచ్ఎన్ అగ్రహారంలో తెదేపా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 1200 కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ చేతుల మీదుగా కూరగాయల పంపిణీ చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
చోడవరంలో అధికార పార్టీ నాయకులు చేసే కార్యక్రమాలపై పోలీసులు దృష్టి పెట్టారు. వారు నిర్వహించే విలేకరుల సమావేశం, పంపిణీ కార్యక్రమాలకు పోలీసులు హాజరవుతున్నారు. సింహాద్రిపురంలో మాజీ సర్పంచ్, వైకాపా నాయకుడు శ్రీనివాసరాజు ప్రజలకు నిత్యవసర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ధర్మశ్రీ, శిక్షణ డీఎస్పీ డా.రవికిరణ్, ఎస్సై లక్ష్మీ నారాయణ హాజరయ్యారు.
అనకాపల్లి ఉన్నత పాఠశాలలో 2007-08 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు... 100 రిక్షా కార్మికుల కుటుంబాలకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు.
అనంతపురం జిల్లాలో...
బుక్కరాయసముద్రం మండలం సిద్ధరంపురంలో ఉపాధి లేక చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. వీరికి పసుపుల బ్రదర్స్ ఆధ్వర్యంలో రెండో సారి 15 లక్షల రూపాయలతో 950 కుటుంబాలకు 22 రకాల నిత్య అవసర సరుకులను పంచారు.
ఉరవకొండ పట్టణంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు.. పాత్రికేయులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎప్పటికప్పుడు వార్తలను సేకరిస్తూ ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్న జర్నలిస్టులను వారు అభినందించారు. వారిని గుర్తించి నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు.
గుంటూరు జిల్లాలో...
గుంటూరు జిల్లాలో కూలీ పనుల కోసం వచ్చి... లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి హోప్ సంస్థ అండగా నిలిచింది. పేరెచర్ల ప్రాంతంలో ఉన్న కూలీలు తినటానికి తిండి లేక ఇబ్బందిపడుతున్న విషయం తెలుసుకుని వారికి సరుకులు అందజేసింది. దాదాపు 201 కుటుంబాలకు 10 కిలోల బియ్యం, 5 కిలోల కూరగాయలు, 7 రకాల వంట సరుకులను పంపిణీ చేశారు.
ప్రకాశం జిల్లాలో..