కరోనా నియంత్రణలో పోలీసుల సేవలను అందరూ కొనియాడుతున్నారు. విశాఖలో పోలీసులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. సెంచరీ క్లబ్ కార్యదర్శి ఎం. అనిల్ బాబు విశాఖ జోన్ వన్ డీసీపీ రంగారెడ్డికి 10 వేల మాస్కులు, 5000 శానిటైజర్లు అందజేశారు. అహర్నిశలు పాటుపడుతున్న పోలీసులకు తమ వంతు సాయంగా మాస్కులు అందజేయడం ఎంతో ఆనందంగా ఉందని సెంచరీ క్లబ్ నిర్వాహకులు తెలిపారు.
పోలీసులకు సెంచరీ క్లబ్ మాస్కుల పంపిణీ - lockdown in Visakha
కరోనా కట్టడిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వారికి దాతలు అండగా ఉంటున్నారు. విశాఖలో పోలీసులకు సెంచరీ క్లబ్ నిర్వాహకులు మాస్కులు, శానిటైజర్లు అందజేశారు.
విశాఖ పోలీసులకు మాస్కుల పంపిణీ