విశాఖపట్నంలోని పెదవాల్తేరులో రవికుమార్‌రెడ్డి అనే వ్యక్తి రోడ్డు పక్కన నివాసం ఉంటున్న అభాగ్యులు, యాచకులకు ఆహారాన్ని అందిస్తున్నారు. అన్నం దొరకక ఎవరూ చనిపోకూడదన్న సంకల్పంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని రవికుమార్ తెలిపారు. తన ఆర్థిక స్తోమత మేరకు రోజుకు 50 మందికి భోజనం అందిస్తున్నామన్న ఆయన.. దాతలు ముందుకువచ్చి ఇలాంటి పేదలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
నిరుపేదలు, నిరాశ్రయులకు ఆహారం పంపిణీ - people problems with lockdown
లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన నిరుపేదలు, నిరాశ్రయులకు సహాయం చేసేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకొస్తున్నారు. వారికి తోచినంత సహాయం చేస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
నిరుపేదలకు, నిరాశ్రయులకు ఆహారం పంపిణీ