విశాఖలోని గోషా ఆసుపత్రిలో ఉన్న రోగులకు, వారి సహాయకులకు స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా ఎవరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో... స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిథులు 34 రోజులుగా ఆహారం పంపిణీ చేస్తున్నారు. లాక్డౌన్ ఉన్నంత కాలం ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని నిర్వాహకులు చెప్పారు.
రోగులు, వారి సహాయకులకు ఆహారం పంపిణీ - విశాఖ జిల్లా వార్తలు
లాక్డౌన్ కారణంగా రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థలు గమనించి కొందరు దాతలు, స్వచ్ఛంద సంస్థలు తమవంతు సహాయం చేస్తున్నాయి.
విశాఖలో రోగులు, వారి సహాకులకు ఆహారం పంపిణీ