గులాబ్ తుపాన్ ప్రభావంపై విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు.. విశాఖ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యుత్, రెవెన్యూ, అగ్నిమాపక, పోలీసు, ఆర్ అండ్ బీ, జీవీఎంసీ, మత్స్యశాఖల అధికారులు, సిబ్బంది సంసిద్ధంగా ఉండాలని సూచించారు. అవసరమైన సహాయ సామగ్రి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. తీర మండలాల ప్రజలకు అవసరమైన సమాచారం అందించాలని ఆదేశించారు. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సేవలు వినియోగించుకోవాలన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహా ఇతర విభాగాల వారంతా సిద్ధంగా ఉన్నారని.. జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు.
GULAB EFFECT: అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల శాఖ
గులాబ్ తుపాన్పై విశాఖ జిల్లా అధికారులతో విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు సమీక్ష చేపట్టారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీర మండలాల ప్రజలకు అవసరమైన సమాచారం అందించాలని ఆదేశించారు.
మంత్రి కన్నబాబు