విశాఖ జిల్లా అనకాపల్లిలోని దిశ పోలీస్ స్టేషన్ లోని ఎస్సైకి కరోనా నిర్ధరణ అయింది. సోమవారం ఈ స్టేషన్ ను రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిశీలించారు. దీంతో భయాందోళనలు నెలకొన్నాయి. విశాఖపట్నం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్, అనకాపల్లికి చెందిన మహిళ, గవరపాలెంకి చెందిన వృద్ధుడు, లక్ష్మీదేవి పేటకు చెందిన వ్యక్తికి కరోనా సోకింది. మంగళవారం అనకాపల్లిలో మొత్తం ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటివరకు అనకాపల్లిలో కరోనా సోకిన వారి సంఖ్య 102కి చేరింది. వీరిలో 32 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
అనకాపల్లి దిశ పోలీస్స్టేషన్ ఎస్సైకి కరోనా.. - అనకాపల్లి దిశ పోలీస్ స్టేషన్ న్యూస్
అనకాపల్లి దిశపోలీస్ స్టేషన్ లోని ఎస్సైకి కరోనా పాజిటివ్ వచ్చింది. సోమవారం ఈ పోలీస్ స్టేషన్ ను డీజీపీ గౌతమ్ సవాంగ్ సందర్శించారు. అనకాపల్లిలో తాజాగా ఐదుగురికి కరోనా సోకింది.
![అనకాపల్లి దిశ పోలీస్స్టేషన్ ఎస్సైకి కరోనా.. disa police station](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7938277-387-7938277-1594186169797.jpg)
disa police station