రాష్ట్రంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని దుర్గా మల్లేశ్వర ఆలయంలో ప్రత్యేక దీపారాధన నిర్వహించారు. దీపాల వెలుగులో ఆలయం శోభాయమానంగా మారింది. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. భవానీ భక్తుల మాలధారణ గీతాలాపనలతో గుడి ప్రాంగణం మార్మోగింది. వివిధ ప్రాంతాలకు చెందిన మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నర్సీపట్నం దుర్గా మల్లేశ్వర ఆలయంలో ప్రత్యేక దీపారాధన - deeparadhana program
రాష్ట్రవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని దుర్గా మల్లేశ్వర ఆలయంలో నిన్న రాత్రి ప్రత్యేక దీపారాధన కార్యక్రమం నిర్వహించారు.
దీపారాధన కార్యక్రమం