Hidden Treasure: గుప్త నిధుల పేరిట విశాఖ మన్యంలో పలువురు దుండగులు దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు. పురాతన విగ్రాహాలపై కన్నేసిన ఓ ముఠా రాత్రి సమయాల్లో దేవాలయాల్లో చొరబడి విగ్రహాలను తస్కరిస్తున్నారు. తాజాగా.. విశాఖ మన్యం చింతపల్లి మండలం ఎర్రబొమ్మల పంచాయతీ పరిధిలోని రోలంగి గ్రామ దేవత సుంకులమ్మ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు.
Hidden Treasure: గుప్త నిధుల పేరిట ఆలయంలో తవ్వకాలు - గుప్త నిధుల పేరిట ఆలయంలో తవ్వకాలు న్యూస్
Hidden Treasure: గుప్త నిధుల పేరిట విశాఖ మన్యం చింతపల్లి మండలం ఎర్రబొమ్మల పంచాయతీ పరిధిలోని రోలంగి గ్రామ దేవత సుంకులమ్మ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు. ఈ ఘటనపై గ్రామ సర్పంచ్ పండయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గుప్త నిధుల పేరిట ఆలయంలో తవ్వకాలు
ఈ ఘటనపై గ్రామ సర్పంచ్ పండయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ తమ గ్రామంలోని దానుడు, భూదేవి ఆలయాల్లో తవ్వకాలు జరిపారన్నారు. గుప్త నిధుల పేరిట తవ్వకాలు తమను భయాందోళనలకు గురిచేస్తున్నాయన్నారు. ప్రభుత్వం స్పందించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటంతో పాటు సమాచార వ్యవస్థకోసం సెల్ టవర్లు ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: CI suspended for cheating women in eluru: యువతిని మోసగించిన కేసులో.. సీఐ సస్పెండ్