ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో ఉన్న కట్ ఆఫ్ ఏరియాను శుక్రవారం డీఐజీ షఫిక్ అహ్మద్ ఖాన్ మొట్టమొదటి సారి సందర్శించారు. ఏవోబీలో గల గుర్రాసేట్టు వద్ద నూతన బీఎస్ఎఫ్ క్యాంప్ ఏర్పాటు తరువాత తొలిసారి ఇక్కడకు విచ్చేశారు. మల్కానాగిరి ఎస్పీ రిషికేశ్‌తో పాటు 9 బెటాలియన్ బీఎస్ఎఫ్ అధికారులతో సమావేశమయ్యారు. మావోయిస్టుల ప్రాబల్యం, తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఏవోబీలో పర్యటించిన డీఐజీ షఫిక్ అహ్మద్ ఖాన్ - aob latest news
ఏవోబీలో ఉన్న కట్ ఆఫ్ ఏరియాను శుక్రవారం డీఐజీ షఫిక్ అహ్మద్ ఖాన్ సందర్శించారు. ఈ సందర్భంగా 9 బెటాలియన్ బీఎస్ఎఫ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఏవోబీలో పర్యటించిన డీఐజీ షఫిక్ అహ్మద్ ఖాన్
నూతన క్యాంపులు ఏర్పాటు తరువాత మారుమూల స్వాభిమాన్ ప్రాంతం అభివృద్ధి పథంలో నడుస్తుంది అని డీఐడీ అన్నారు. ఇప్పటివరకు మావోయిస్టులకు కంచుకోటగా ఉన్నా గుర్రాసేట్టు ప్రాంతం... కొత్త క్యాంప్‌ల ఏర్పాటు తరువాత బలహీనం పడుతుందన్నారు.