ప్రశాంత పోలింగ్‌కు అందరు సహకరించాలని... అదే క్రమంలో స్వేచ్ఛగా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్లోని కొయ్యూర, నర్సీపట్నం మండలాల్లో ఓటర్లతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ప్రసంగించారు.
'ఓటర్లను ప్రభావితం చేస్తే కఠిన చర్యలు తప్పవు'
విశాఖ జిల్లాలో ప్రశాంత ఓటింగ్‌కు సహకరించాలని ప్రజలను విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు కోరారు. ప్రతిఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.ఓటర్లను మద్యం, నగదు వంటివాటితో ఎరవేసే ప్రయత్నాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, పోలింగ్‌కు విఘాతం కలిగిన చర్యలు తీసుకుంటామని రంగారావు హెచ్చరించారు. ఓటర్లను మద్యం, నగదు వంటివాటితో ఎరవేసే ప్రయత్నాలు చేస్తే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా రూరల్ ఎస్పీ కృష్ణారావు, నర్సీపట్నం ఏఎస్పీ సింహ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం!