ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంతిమయాత్రకు దారేది..? - విశాఖ జిల్లా

విశాఖ జిల్లా మన్యం వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో శ్మశానాలకు వెళ్లేందుకు సరైన దారి లేదు. శవపేటిక మోసే వారు ఎక్కడ జారి పడతామోనన్న భయంతో జాగ్రత్తగా అడుగులో అడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొంది.

శవం
శవం

By

Published : Aug 31, 2021, 9:32 AM IST

విశాఖ మన్యం వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శ్మశానాలకు వెళ్లేందుకు సరైన దారి లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో అల్లూరి స్మారక ఉద్యానానికి సమీపంలో శ్మశానం ఉంది. రహదారి నుంచి అక్కడకు సుమారు 200 మీటర్ల దూరం ఉంటుంది. వర్షాలకు దారంతా చిత్తడిగా మారింది. శవపేటిక మోసే వారు ఎక్కడ జారి పడతామోనన్న భయంతో జాగ్రత్తగా అడుగులో అడుగు వేయాల్సిన పరిస్థితి.

స్థానిక యునైటెడ్‌ చర్చి పాస్టర్‌ అంకిరెడ్డి సైమన్‌ (45) సోమవారం మరణించారు. ఆయన భౌతికకాయాన్ని శ్మశానానికి తరలించేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి శ్మశానాలకు వెళ్లే మార్గాలను సీసీ రోడ్లుగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:Ganja Seized: విశాఖ ఏజెన్సీలో రూ.రెండున్నర కోట్ల గంజాయి స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details