విశాఖపట్నం నుంచి జి.మాడుగుల వెళ్తున్న ఓ డీజిల్ ట్యాంకర్.. పాడేరు ఘాట్ రోడ్డులో మలుపు తిరిగే క్రమంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్, క్లీనర్‌ను స్థానికులు మినుములూరు ఆస్పత్రికి తరలించారు. కొండకు రోడ్డుకు మధ్యలో ట్యాంకర్ బోల్తా పడటంతో డీజిల్ వృథాగా పోయింది. అటుగా వెళ్లే వాహనచోదకులు వాటర్ బాటిళ్లలో నింపుకుపోతున్నారు. 12వేల లీటర్లు డీజిల్ నేల పాలైనట్లు తెలుస్తోంది.
పాడేరు ఘాట్ రోడ్డులో డీజిల్ ట్యాంకర్ బోల్తా - visakha latest news
విశాఖ జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ట్యాంకర్లో ఉన్న 12వేల లీటర్లు డీజిల్ నేల పాలైంది.
పాడేరు ఘాట్ రోడ్లో డీజిల్ ట్యాంకర్ బోల్తా
ఇక్కడ మలుపు అధికంగా ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇదే ప్రదేశంలో గతంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదకరమైన మలుపులో రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని వాహనచోదకులు, స్థానికులు కోరుతున్నారు.