ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనకాపల్లిలో ఒకే రోజు తొమ్మిది కరోనా కేసులు నిర్ధరణ - అనకాపల్లి నేర వార్తలు

విశాఖ జిల్లా అనకాపల్లిలో తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మండల పరిధిలోని ప్రజలందరూ భౌతిక దూరం పాటించి, మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.

Diagnosis of nine corona cases in a single day in Anakapalli vizag district
అనకాపల్లిలో ఒకే రోజు తొమ్మిది కరోనా కేసులు నిర్ధారణ

By

Published : Jun 26, 2020, 9:55 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో ఒకే రోజు తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపింది. ఈ క్రమంలో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అనకాపల్లిలోని దాసరి గెడ్డ ప్రాంతంలో ముగ్గురికి, శతకంపట్టు వద్ద ఒకరికి, జంపావారివీధిలో నలుగురికి, సత్యనారాయణపురంలో ఒకరికి వైరస్​ పాజిటివ్​గా తేలింది.

కేసుల పెరుగదలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మండలం పరిధిలో అధిక సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details