వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాదులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ప్రజా ఆరోగ్య వేదిక, ప్రజా పరిరక్షణ సమితి సంయుక్తంగా విశాఖలో ఆందోళన చేపట్టాయి. గత పది సంవత్సరాల్లో ఎన్నడూ లేనివిధంగా జ్వరపీడితుల సంఖ్య పెరిగిందని.. డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు విపరీతంగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోగాల నుండి ప్రజలను రక్షించాలంటూ జీవీఎంసీ గాంధీ పార్కు ఎదుట ప్లకార్డులు ప్రదర్శించి అవగాహన కల్పించారు. ప్రభుత్వ వైద్యం పేదలకు అందని ద్రాక్షలా మిగిలిపోయిందని..వారికి వైద్యం అందించటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.
Seasonal diseases: సీజనల్ వ్యాధులు అరికట్టాలంటూ ధర్నా - visakha news
వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టాలని ప్రజా ఆరోగ్య వేదిక, ప్రజా పరిరక్షణ సమితి ఆందోళన చేశాయి. విశాఖలో జీవీఎంసీ గాంధీ పార్కు ఎదుట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.
సీజనల్ వ్యాధులను అరికట్టాలంటూ ధర్నా
ప్రభుత్వం వెంటనే సీజనల్ రోగాలు పట్ల స్పందించి విస్తృతంగా మెడికల్ క్యాంపులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : WATER PROBLEM IN KGH: పేరుకు పెద్దాసుపత్రి..నీళ్లకు కటకట..కేజీహెచ్‌లో దుస్థితి