Ayyappa Devotees Agitation in Visakha: విశాఖ రైల్వే స్టేషన్లో అయ్యప్ప స్వామి భక్తులు పట్టాలపై నిరసన వ్యక్తం చేశారు. విశాఖ నుంచి కొల్లం వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లో ఎస్ 8, 9, 10 బోగీలు కనిపించకపోవడంతో.. రిజర్వేషన్ చేయించుకున్న అయ్యప్ప స్వామి భక్తులు ఆందోళన చేపట్టారు. అయ్యప్ప శరణుఘోషతో ఎనిమిదో నెంబర్ ప్లాట్ఫారం ప్రతిధ్వనించింది. రైల్వే అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ ఉదయం బయలుదేరాల్సిన రైలు భక్తుల ఆందోళనలతో నిలిచిపోయింది. తమకు బోగీలు ఏర్పాటు చేసేదాకా.. రైలు కదలనివ్వమని అయ్యప్ప స్వామి భక్తులు ఆందోళన కొనసాగిస్తున్నారు.
విశాఖ రైల్వేస్టేషన్లో అయ్యప్ప భక్తుల ఆందోళన.. ఏమైంది..? - AP highlights
Dharna of Ayyappa devotees: విశాఖ రైల్వేస్టేషన్లో అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. విశాఖ-కొల్లం ఎక్స్‌ప్రెస్‌లో 3 బోగీలు లేవంటూ నిరసన తెలిపారు. రిజర్వేషన్ బోగీలు పెట్టకుంటే.. తాము ఎలా ప్రయాణం చేయాలంటూ వారు నిలదీశారు. అధికారుల తీరును నిరసిస్తూ విశాఖ-కొల్లం ఎక్స్‌ప్రెస్ ముందు కూర్చుని ధర్నా చేశారు.
Dharna of Ayyappa devotees
Last Updated : Dec 15, 2022, 3:48 PM IST