మంగళవారం సాయంత్రం విశాఖ చేరుకున్న డీజీపీ.. నగర పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హాతో కలిసి.. భీమిలి పరిసరాల్లోని గ్రేహౌండ్స్, ఫైరింగ్ రేంజ్లను సందర్శించినట్లు సమాచారం. బుధవారం ఉదయం అధికారులతో సమావేశం కానున్నట్లు తెలిసింది. సాధారణంగా డీజీపీ స్థాయి అధికారి వచ్చినప్పుడు పోలీసు ఉన్నతాధికారులు కలుస్తారు. దీనికి భిన్నంగా ఎవరిని కలవకుండానే సీపీతోపాటు భీమిలి పరిసర ప్రాంతాల్లో పర్యటించడం గమనార్హం.
విశాఖలో డీజీపీ గౌతమ్ సవాంగ్ రహస్య పర్యటన! - విశాఖలో డీజీపీ గౌతమ్ సవాంగ్ పర్యటన తాజా వార్తలు
విశాఖలో డీజీపీ గౌతమ్ సవాంగ్ పర్యటిస్తున్నారు. మంగళవారం సాయంత్రం విశాఖ చేరుకున్న డీజీపీ భీమిలి పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన పర్యటనను రహస్యంగా ఉంచారు.
dgp gautham sawang tour in vishaka