2020 సంవత్సరానికిగాను పోలీస్ విధులలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విశాఖ రేంజ్ (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ) పోలీసులు 55 మంది.. డీజీపీ కమాండేషన్ డిస్క్ (DGP Commendation Disk awards) అవార్డులకు ఎంపికయ్యారు. విశాఖలోని వుడా చిల్డ్రన్స్ థియేటర్లో అవార్డుల ప్రదానోత్సవానికి డీజీపీ గౌతమ్ సవాంగ్ (ap dgp goutham sawang) ముఖ్య అతిథిగా హాజరై అవార్డులను బహుకరించారు. పోలీసులు ప్రజలకు సేవ చేసే విధానంలో వృత్తి నైపుణ్యం పెంచుకోవాలని.. పోలీసుల ప్రతిష్ట పెంచే విధంగా విధులు నిర్వహించాలని డీజీపీ అన్నారు.
ఈ కార్యక్రమంలో విశాఖ రేంజ్ డీఐజీ ఎల్ కె.వీ రంగారావు, విజయనగరం జిల్లా డీఐజీ రాజకుమారి, విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా,ఎస్పీ విశాఖపట్నం జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్, రేంజ్ పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.