విశాఖలోని సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో.. భక్తులు ఇరుముడి సమర్పించే సమయంలో ఉద్రిక్తత నెలకొంది. కొండపై ఇరుముడి సమర్పించడానికి ఆలయ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. దీక్ష తీసుకున్న తాము.. ఇరుముడిని స్వామివారికి సమర్పించకపోవడం అపచారమని భక్తులు అన్నారు.
అప్పన్న ఆలయంలో ఉద్రిక్తత.. ఇరుముడి సమర్పణలో ఆందోళన - simhachalam temple latest news
విశాఖలోని సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో.. ఇరుముడి సమర్పణలో ఉద్రిక్తత నెలకొంది. కొండపై ఇరుముడి సమర్పించడానికి ఆలయ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో భక్తులు ఆందోళన చేపట్టారు.
అప్పన్న ఆలయంలో ఉద్రిక్తత.. ఇరుముడి సమర్పణలో ఆందోళన
తీరా గుడికి వచ్చాక.. కొండపైన ఇరుముడి సమర్పణకు అనుమతి లేదని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంపై.. ఆలయ ఈవో సూర్యకళ స్పందిస్తూ.. అప్పన్న తొలి మెట్టు వద్ద ఇరుముడి సమర్పించాల్సిందిగా తాము ముందుగానే తెలిపామని చెప్పారు.
ఇదీ చదవండి:
devotees rush: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి పోటెత్తిన భవానీలు